షాబాజ్‌ అహ్మద్‌కు పిలుపు

బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌కు భారత సెలక్టర్ల నుంచి పిలుపు అందింది. ఐపీఎల్‌లో   సత్తా చాటిన ఈ ఆటగాడు.. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.

Published : 17 Aug 2022 03:13 IST

జింబాబ్వేతో సిరీస్‌కు టీమ్‌ఇండియాలో చోటు

దిల్లీ: బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌కు భారత సెలక్టర్ల నుంచి పిలుపు అందింది. ఐపీఎల్‌లో   సత్తా చాటిన ఈ ఆటగాడు.. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. బెంగాల్‌కు చెందిన 27 ఏళ్ల షాబాజ్‌ 2022 ఐపీఎల్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన అతడు 41.64     సగటుతో 219 పరుగులు చేశాడు. ఎడమచేతి వాటం స్పిన్‌తో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ‘‘అఖిలభారత సెలక్షన్‌ కమిటీ సుందర్‌ స్థానంలో షాబాజ్‌ను జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంగ్లాండ్‌లో కౌంటీ మ్యాచ్‌ ఆడుతూ గాయపడ్డ సుందర్‌.. జింబాబ్వే పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. భారత్‌, జింబాబ్వే మధ్య తొలి వన్డే గురువారం జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని