శుభి, చార్వీలకు టైటిళ్లు

ప్రపంచ చదరంగ వేదికపై మరోసారి భారత ప్లేయర్లు సత్తాచాటారు. ఫిడె ప్రపంచ క్యాడెట్స్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మంగళవారం శుభి గుప్తా, చార్వి టైటిళ్లు దక్కించుకున్నారు. బాలికల అండర్‌-12 విభాగంలో 11 రౌండ్ల నుంచి  

Published : 28 Sep 2022 02:45 IST

ప్రపంచ క్యాడెట్‌ చెస్‌

బటుమి (జార్జియా): ప్రపంచ చదరంగ వేదికపై మరోసారి భారత ప్లేయర్లు సత్తాచాటారు. ఫిడె ప్రపంచ క్యాడెట్స్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మంగళవారం శుభి గుప్తా, చార్వి టైటిళ్లు దక్కించుకున్నారు. బాలికల అండర్‌-12 విభాగంలో 11 రౌండ్ల నుంచి  8.5 పాయింట్లు సాధించిన శుభి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అండర్‌-8 విభాగంలో  9.5 పాయింట్లతో చార్వి ఛాంపియన్‌గా నిలిచింది. 11 రౌండ్లు ముగిసే సరికి బోధన శివానందన్‌ (ఇంగ్లాండ్‌)తో కలిసి సమంగా నిలిచిన ఆమె.. మెరుగైన టైబ్రేకర్‌ స్కోరుతో టైటిల్‌ ఖాతాలో వేసుకుంది. అండర్‌-8 బాలుర విభాగంలో సఫీన్‌ సఫరుల్లాఖాన్‌   9 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నాడు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన మార్క్‌ (ఫ్రాన్స్‌), రోమన్‌ (రష్యా) కంటే అతను కేవలం 0.5 పాయింట్‌తో వెనకబడ్డాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts