FIFA World Cup 2022: దురదృష్టమంటే మెక్సికోదే.. గెలిచినా ఇంటికే..

దురదృష్టమంటే మెక్సికోదే. గ్రూప్‌లో చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 2-1తో సౌదీ అరేబియాపై గెలిచినా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించక తప్పలేదు. గోల్‌ అంతరం కారణంగా గ్రూప్‌లో మూడో స్థానానికే పరిమితమైంది.

Updated : 02 Dec 2022 08:26 IST

లుసాయిల్‌: దురదృష్టమంటే మెక్సికోదే. గ్రూప్‌లో చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 2-1తో సౌదీ అరేబియాపై గెలిచినా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించక తప్పలేదు. గోల్‌ అంతరం కారణంగా గ్రూప్‌లో మూడో స్థానానికే పరిమితమైంది. మరో గోల్‌ చేసినా లేదా ప్రత్యర్థికి గోల్‌ సమర్పించుకోకున్నా ఆ జట్టు ముందంజ వేసేది. 1978 తర్వాత ఆ జట్టు నాకౌట్‌ చేరకపోవడం ఇదే తొలిసారి. గత ఏడు ప్రపంచకప్‌ల్లోనూ ఆ జట్టు గ్రూప్‌ దశ దాటింది. మెక్సికో తొలి అర్ధభాగంలో ప్రత్యర్థి రక్షణశ్రేణిని ఛేదించలేకపోయింది. ద్వితీయార్ధం ఆరంభంలోనే కార్నర్‌ కిక్‌ను గోల్‌పోస్టు దగ్గరే మాటు వేసిన మార్టిన్‌ (47వ) నెట్‌లోపలికి పంపించి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత అయిదు నిమిషాలకే చవెజ్‌ (52వ) ఫ్రీకిక్‌ను 30 గజాల దూరం నుంచి కళ్లుచెదిరే రీతిలో నేరుగా గోల్‌పోస్టులోకి పంపించాడు. అక్కడి నుంచి మెక్సికో దాడులు పెంచింది. కానీ ప్రత్యర్థి గోల్‌కీపర్‌ వాటిని సమర్థంగా అడ్డుకున్నాడు. 73వ నిమిషంలో చవెజ్‌ మరో ఫ్రీకిక్‌ను గోల్‌గా మలచలేకపోయాడు. నిర్ణీత సమయం ముగిసింది. 2-0తో గెలిచి మెక్సికో నాకౌట్‌ చేరుతుందనిపించింది. కానీ అదనపు సమయంలో సలెమ్‌ (90+5వ) గోల్‌ కొట్టి ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో కన్నీళ్లతో మెక్సికో ఆటగాళ్లు మైదానం వీడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని