ఇక్కడ రాణిస్తే.. అక్కడ స్థానం పదిలం: గావస్కర్‌

 ఐపీఎల్‌ 15వ సీజన్‌ పోటీలు అంతర్జాతీయ ఆటగాళ్లందరికీ...

Published : 26 Mar 2022 01:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రేపటి నుంచి ప్రారంభమయ్యే మెగా టోర్నీ అంతర్జాతీయ ఆటగాళ్లందరికీ ఎంతో కీలకం. మరీ ముఖ్యంగా ఆసీస్‌ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌ కోసం సన్నాహకంగా దీనిని వాడుకునే అవకాశం ఉంది. జట్టులోకి రావాలనుకునే ప్లేయర్లతోపాటు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు చక్కని వేదికగా భావించేవాళ్లకి ఈ మెగా టోర్నీ చక్కని అవకాశం అని టీమ్‌ఇండియా దిగ్గజ క్రికెటర్‌ సునిల్ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. భారత ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులో తన స్థానం పదిలం చేసుకోవాలనుకుంటే ఇదో మంచి అవకాశమని పేర్కొన్నాడు. 

‘‘గత రెండేళ్లుగా ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ప్రస్తుత సీజన్‌లో అద్భుతంగా రాణిస్తే ప్రపంచకప్‌ జట్టులో స్థానం పదిలం చేసుకొనే అవకాశం ఉంది. ఈ ప్రదర్శన ఆధారంగానే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌ జట్టును ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే యాదవ్‌ సహా యువ ఆటగాళ్లకు ఇదొక మంచి ఛాన్స్’’ అని సునిల్ గావస్కర్‌ తెలిపాడు. దిల్లీ తరఫున ఆడుతున్న డేవిడ్ వార్నర్‌ ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరమేమీ లేదని అభిప్రాయపడ్డాడు. ప్రతి క్రికెటర్‌కూ గడ్డు రోజులుంటాయని, వార్నర్‌ గత సీజన్‌లో ఆ కాలాన్ని ఎదుర్కొన్నాడని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని