IND vs NZ: సిరాజ్‌ స్థానంలో హర్షల్‌ పటేల్‌కు అవకాశమివ్వాలి : దినేశ్‌ కార్తిక్

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్‌ స్థానంలో హర్షల్ పటేల్‌కు అవకాశమివ్వాలని టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్

Published : 19 Nov 2021 01:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్‌ స్థానంలో హర్షల్ పటేల్‌కు అవకాశమివ్వాలని టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్ సూచించాడు. బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సిరాజ్‌ నాలుగు ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ మాత్రమే తీసి 39 పరుగులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న హర్షల్ పటేల్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని దినేశ్‌ కార్తిక్‌ సూచించాడు. హర్షల్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్న విషయం తెలిసిందే.

‘ప్రస్తుతం అవేశ్‌ ఖాన్‌, హర్షల్ పటేల్ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. వారిద్దరిలో ఎవరికైనా అవకాశం ఇవ్వవచ్చు. అయితే, రెండో మ్యాచ్ జరుగనున్న రాంచీ పిచ్‌లో హర్షల్ అయితేనే ప్రభావం చూపగలడనిపిస్తోంది. ఎందుకంటే, అక్కడి పిచ్‌ మందకోడిగా ఉంటుంది. ఆ పిచ్‌పై అతడు మంచి లయతో బౌలింగ్‌ చేయగలడు. ఒకవేళ పేస్‌ బౌలింగ్‌లో మరింత వైవిధ్యం కావాలనుకుంటే అవేశ్‌ ఖాన్‌ని తుదిజట్టులోకి తీసుకోవాలి’ అని దినేశ్‌ కార్తిక్ పేర్కొన్నాడు. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ నవంబర్ 19న రాంచీ వేదికగా జరుగనుంది.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని