WI vs IND : అది నాకు మరింత ప్రేరణనిస్తుంది : సిరాజ్‌

విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సిరాజ్‌ 5 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Published : 24 Jul 2023 16:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు(WI vs IND)లో ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో సిరాజ్‌(Mohammed Siraj) (5/60) ప్రధాన పాత్ర పోషించాడు. ఫ్లాట్‌ పిచ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన అనంతరం.. సిరాజ్‌ మాట్లాడాడు. ఇలాంటి పిచ్‌పై వికెట్లు తీయడం కష్టమని.. అయితే, తాను సవాళ్లను స్వీకరిస్తానని వెల్లడించాడు.

‘ఫ్లాట్‌ ట్రాక్‌పై ఐదు వికెట్లు తీయడం అంత సులభం కాదు. ఈ క్రెడిటంతా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సోహెమ్‌ దేశాయ్‌ భాయ్‌దే. నా ఫిట్‌నెస్‌ గురించి ఎంతో కష్టపడ్డాడు. నిరంతరం మ్యాచ్‌లు ఆడుతుండటంతో.. నేను ఫిట్‌గా ఉండేలా అతడు చూసుకుంటాడు. ఇక్కడ వాతావరణం చాలా వేడిగా, ఉక్కపోతగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫాస్ట్‌ బౌలర్లు తమను తాము ఛార్జ్‌ చేసుకోవడం ఎంతో కష్టం. లాంగ్‌ స్పెల్స్‌ వేయడం అంత సులభం కాదు’ అని సిరాజ్‌ వివరించాడు.

సాయి సుదర్శన్‌ ఔటైంది ‘నోబాలా’..?

‘ఇక నా ప్రణాళికలను చక్కగా అమలు పరిచాను. స్టంప్స్‌ టు స్టంప్స్‌ బంతులను సంధించాను. సులువుగా పరుగులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను.  నేను బాధ్యతలను ఇష్టంగా స్వీకరిస్తాను. బాధ్యతలతో మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు.. అది నాకు మరింత ప్రేరణనిస్తుంది. సవాళ్లను కూడా విసురుతుంది. సవాళ్లను స్వీకరించడానికి నేను ఇష్టపడతాను’ అని సిరాజ్‌ పేర్కొన్నాడు.

ఇర రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం 76/2 స్కోరుతో కొనసాగుతున్న విండీస్‌ ఇంకా 289 పరుగులు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని