అంగారకుడిపై క్రికెట్‌ పిచ్‌.. ఐసీసీ ట్వీట్‌

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అరుణ గ్రహంపైకి రోవర్‌ను విజయవంతంగా చేర్చిన వేళ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చేసిన ట్వీట్‌ ఆకట్టుకుంటోంది....

Published : 22 Feb 2021 21:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అరుణ గ్రహంపైకి రోవర్‌ను విజయవంతంగా చేర్చిన వేళ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చేసిన ట్వీట్‌ ఆకట్టుకుంటోంది. ప్రపంచం వెలుపల కూడా క్రికెట్‌ ఉందని తాము ఎప్పుడూ చెబుతుంటామని ఐసీసీ ట్వీట్‌ చేసింది. అంగారక గ్రహంపై క్రికెట్‌ పిచ్‌ పక్కనే నాసా పంపిన రోవర్‌ కనిపిస్తున్న ఫొటోను ఐసీసీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. అంగారక గ్రహంపై టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఏం తీసుకుంటారంటూ నెటిజన్లను ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. అక్కడ పిచ్‌ పొడిగా ఉండే కారణంగా మొదట బ్యాటింగ్‌ తీసుకుంటాం అని కొందరు ట్వీట్ చేయగా.. అక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. టాస్‌ వేసిన కాయిన్‌ కిందకు రాకపోవచ్చు అలాంటప్పుడు టాస్‌ ఎవరు గెలిచారో ఎలా తెలుస్తుంది అంటూ ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని