స్టార్క్‌ అవి బంతులా.. బుల్లెట్లా? 

ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ శనివారం 31వ జన్మదినం జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి సోషల్‌మీడియాలో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి...

Published : 31 Jan 2021 01:34 IST

వికెట్లు ఎగిరి పడుతున్న వీడియో చూడండి..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ శనివారం 31వ జన్మదినం జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి సోషల్‌మీడియాలో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు ఐసీసీ ట్వీట్‌ చేస్తూ ఈ స్టార్‌ పేసర్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. అలాగే స్టార్క్‌ తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించిన వీడియోనూ అభిమానులతో పంచుకుంది. అందులో అతడు బంతులు విసురుతుంటే అవి బుల్లెట్లలా దూసుకెళ్లి వికెట్లను ఎగురవేయడం కనిపించింది.

అంతకుముందు 2015లో ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ గెలిచిన సందర్భంగా స్టార్క్‌తో ఉన్న ఫొటోను ఐసీసీ ట్వీట్‌ చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే మిచెల్‌స్టార్క్‌. 2015, 2019 పురుషుల వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు. పెద్ద స్టేజీ మీద చెలరేగడానికే తయారయ్యాడు’ అని ప్రశంసించింది. ఇక 2015 మెగా ఈవెంట్‌లో 22 వికెట్లు పడగొట్టిన ఈ ఆసీస్‌ పేసర్‌.. 2019లో 27 వికెట్లు తీశాడు. అలాగే మొత్తంగా 61 టెస్టులు, 96 వన్డేలు, 35 టీ20లు ఆడి.. వరుసగా 255, 184, 47 వికెట్లు తీశాడు. ఇటీవల టీమ్‌ఇండియాతో ఆడిన టెస్టు సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో 8 వికెట్లు తీయగా, చివరి రెండు టెస్టుల్లో 3 వికెట్లే పడగొట్టాడు. 

ఇవీ చదవండి..
రంజీకి బదులు విజయ్‌ హజారె ట్రోఫీ 
ద్రవిడ్‌ నుంచి ఆణిముత్యాలను చూస్తున్నాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని