IND VS ENG: సూర్యకుమార్‌ యాదవ్‌.. ఈ పేరు గుర్తుపెట్టుకోండి..!

ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20 లో టీమ్‌ఇండియా 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌

Updated : 11 Jul 2022 14:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20లో టీమ్‌ఇండియా 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ మాత్రం మ్యాచ్‌కే హైలైట్‌. 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117 పరుగులు సాధించాడు. మిగిలిన బ్యాటర్ల సహకారం లేకపోవడంతో టీమ్‌ఇండియాకు పరాజయం తప్పలేదు. కానీ, సూర్య శతకం భారత అభిమానులనే కాదు.. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌తో సహా ఆ దేశ అభిమానులను కూడా ఆకట్టుకొంది. 

 మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ పోరాడిన తీరు అద్భుతం. బౌలర్‌ ఎలాంటి బంతి వేసినా సూర్య బౌండరీకి పంపించాలనుకుంటే... తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో ఫీల్డర్‌ లేని ప్రదేశంలోకి బాల్‌ని తరలించడం అతడి ప్రత్యేకత. ఆఫ్‌సైడ్‌ సిక్సర్లు.. స్ట్రయిట్ ఫోర్లు.. ఫైన్‌ లెగ్‌ వైపు సూర్య బాదిన బౌండరీలతో ట్రెంట్‌బిడ్జ్‌ మైదానంలో పరుగుల వరద పారింది. దీంతో టీ20ల్లో సూర్య తన తొలి శతకం నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన టీమ్‌ఇండియా మాజీ ఆటగాళ్లు ట్విటర్‌ వేదికగా సూర్యను అభినందించారు.

మ్యాచ్‌ అనంతరం టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ మాట్లాడుతూ... కొంతకాలంగా సూర్య బ్యాటింగ్‌ చూస్తున్నాను. అతడు ఆడే షాట్లు అద్భుతంగా ఉంటాయి. సూర్య టీమ్‌ఇండియాలోకి వచ్చినప్పటి నుంచి బలమైన ఆటగాడిగా ఎదుగుతున్నాడు. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టగలడు.









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని