IND vs SA : బుమ్రా పాంచ్‌ పటాకా.. దక్షిణాఫ్రికా ఆలౌట్‌.. భారత్‌కు లీడ్‌

కీలకమైన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికాను..

Updated : 12 Jan 2022 20:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కీలకమైన మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలర్‌ బుమ్రా (5/42) సూపర్‌ స్పెల్‌ వేశాడు. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 13 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. కీగన్‌ పీటర్సెన్‌ (72: 166 బంతుల్లో) అర్ధ శతకంతో రాణించగా.. టెంబా బవుమా (28), కేశవ్‌ మహరాజ్‌ (25), డస్సెన్ (21) ఫర్వాలేదనించారు. మిగతా బ్యాటర్లలో డీన్‌ ఎల్గర్‌ 3, మార్‌క్రమ్‌ 8, వెరైన్ డకౌట్, జాన్‌సెన్ 7, రబాడ 15, ఒలివియర్ 10*, ఎంగిడి 3 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 5, ఉమేశ్‌ యాదవ్‌ 2, షమీ 2, శార్దూల్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 223/10. 

దక్షిణాఫ్రికా నుంచి అతడొక్కడే.. 

భారత బౌలింగ్‌ను ఎదుర్కొ,ని దక్షిణాఫ్రికా ఈ మాత్రం స్కోరునైనా సాధించిందంటే దానికి కారణం కీగన్‌ పీటర్సెన్‌.. ఓ పక్క వికెట్లు పడుతున్నా ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్‌ చేశాడు. టెంబా బవుమా, డస్సెన్‌తో కలిసి పీటర్సెన్ కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. అయితే టీమ్‌ఇండియా బౌలర్లు వికెట్లు తీస్తూ మ్యాచ్‌పై పట్టు నిలిపారు. షమీ కీలక సమయంలో బవుమాతోపాటు వెరైన్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. వికెట్ల వేటను ప్రారంభించిన బుమ్రా.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు ముగింపు పలకడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని