భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం
టీమిండియా ఫాస్ట్‌బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్(63) గురువారం సాయంత్రం కన్నుముశారు.
(photo: Bhuvneshwar Kumar Twitter)
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్(63) గురువారం సాయంత్రం కన్నుముశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దిల్లీ ఎయిమ్స్‌లో కిమోథెరపీ చికిత్స కూడా చేయించుకుని ఇటీవలే ఇంటికి తిరిగొచ్చారు. అనంతరం మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో రెండు వారాల క్రితం మీరట్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు. రెండు రోజుల క్రితమే అక్కడి నుంచి డిశ్చార్జి చేశారు. కిరణ్ పాల్ సింగ్ ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన పదవీ విరమణ పొందారు.
కాగా, గత కొంత కాలంగా గాయాలతో సతమతమవుతున్న భువీ.. మనుపటి ఫామ్‌ని అందుకోలేకపోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టులకు ప్రకటించిన జట్టులో భువీకి చోటు దక్కలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్‌రైజర్స్‌పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్‌లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్‌లో అర్హత సాధించడానికి భారత్‌కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్‌కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్‌లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్‌లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్‌స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్‌గా సీరియస్‌గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..