43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో

అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్‌స్పిన్నర్‌ ఫ్రాంక్‌ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్‌ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది.

Published : 07 May 2024 01:51 IST

కంపాలా: అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్‌స్పిన్నర్‌ ఫ్రాంక్‌ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్‌ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. బ్రయాన్‌ మసాబా ఆ జట్టుకు కెప్టెన్‌. ఆఫ్రికా క్వాలిఫయర్స్‌ రీజనల్‌లో ఫైనల్‌లో రెండో స్థానంలో నిలవడం ద్వారా ఉగాండా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. గ్రూప్‌-సిలో ఉన్న ఉగాండా, తన తొలి మ్యాచ్‌లో జూన్‌ 3న అఫ్గానిస్థాన్‌తో తలపడుతుంది.

ఉగాండా జట్టు: బ్రయాన్‌ మసాబా, రిజాత్‌ అలీ షా, కెన్నెత్‌ వైస్వా, దినేశ్‌ నక్రాని, ఫ్రాంక్‌ సుబుగా, రోనక్‌ పటేల్‌, రోజర్‌ ముకాసా, కోస్మాస్‌ క్యెవుటా, బిలాల్‌ హసున్‌, ఫ్రెడ్‌ అచెలమ్‌, రాబిన్సన్‌ ఒబుయా, సిమోన్‌ సెసాజి, హెన్నీ సెన్యోండో, అల్పేష్‌ రాజ్‌మణి, జుమా మియాజి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని