IND vs ENG: ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టు.. సెంచరీలతో చెలరేగిన రోహిత్‌, శుభ్‌మన్‌..

ఇంగ్లాండ్‌తో ఆడుతున్న ఆఖరి టెస్టులో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీలతో అదరగొట్టారు.

Updated : 08 Mar 2024 15:37 IST

ధర్మశాల: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు(IND vs ENG 2024)లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma), శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill) అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇద్దరూ అద్భుత సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ సిరీస్‌లో వీరిద్దరికీ ఇవి రెండో శతకాలు కావడం విశేషం. లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ 60 ఓవర్లకు వికెట్‌ నష్టానికి 264 పరుగులు చేసింది.

భారత స్పిన్‌కు విలవిల్లాడి ఇంగ్లాండ్‌ 218 పరుగులకే ఆలౌట్‌ అయిన అదే పిచ్‌పై రోహిత్‌, గిల్‌ భారీ షాట్లతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా శతకాలు పూర్తి చేశారు. రోహిత్‌ 154 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ కొట్టగా.. కాసేపటికే గిల్‌ 141 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో శతకం సాధించాడు.

ఈ శతకంతో రోహిత్‌ ఖాతాలో పలు రికార్డులు చేరాయి..

  • ఈ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌ 48 శతకాలకు చేరుకున్నాడు. భారత్‌ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన వారి జాబితాలో రాహుల్‌ ద్రవిడ్‌ సరసన మూడో స్థానంలో ఉన్నాడు.
  • ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ శతకాలు బాదిన వారి జాబితాలో రోహిత్‌(43).. వార్నర్‌(49), సచిన్‌(45) తర్వాత స్థానంలో నిలిచాడు.
  • ఇంగ్లాండ్‌పై ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు బాదిన  భారత క్రికెటర్‌గా సునీల్‌ గావస్కర్‌ సరసన రోహిత్‌(4) చేరాడు.
  • 2021 నుంచి ఎక్కువ టెస్టు సెంచరీలు సాధించిన భారత క్రికెటర్‌ రోహితే. హిట్‌మ్యాన్‌ 6 సెంచరీలు చేయగా.. ఆ తర్వాత గిల్‌(4) ఉన్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని