Tokyo Olympics: హాకీలో చిత్తుగా ఓడిపోయిన భారత్‌

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఆదివారం ప్రపంచ నంబర్‌ వన్‌ టీమ్‌ ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవంపాలైంది. పూల్‌-ఏలోని రెండో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 1-7 తేడాతో ఓటమిపాలైంది...

Published : 26 Jul 2021 01:58 IST

ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం..

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఆదివారం ప్రపంచ నంబర్‌ వన్‌ టీమ్‌ ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం పాలైంది. పూల్‌-ఏలోని రెండో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 1-7 తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా ఏ దశలోనూ భారత్‌కు అవకాశమివ్వలేదు. దాంతో భారత్‌పై సునాయాస విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఒలింపిక్స్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందడం గమనార్హం. అంతకుముందు టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 3-2 తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలి 15 నిమిషాల్లో గట్టిపోటీ ఇచ్చిన భారత్‌ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. ఆట ప్రారంభమైనప్పటి నుంచే ఆస్ట్రేలియా క్రమం తప్పకుండా గోల్స్‌ సాధించింది. 10వ నిమిషంలో డానియెల్‌ బీలె తొలి గోల్‌తో అలరించగా తర్వాత 21వ నిమిషంలో జెరీమీ హేవార్డ్‌, 26వ నిమిషంలో జాషువా బెల్ట్స్‌, 40, 42వ నిమిషాల్లో బ్లేక్‌ గోవర్స్‌, 51వ నిమిషంలో టిమ్‌బ్రాండ్‌ వరుసగా ఆధిపత్యం చెలాయించారు. మరోవైపు భారత్‌ నుంచి 34వ నిమిషంలో దిల్‌ప్రీత్‌ సింగ్‌ ఒక్కడే ఏకైక గోల్‌ సాధించాడు. ఇక టీమ్‌ఇండియా మంగళవారం స్పెయిన్‌తో తదుపరి మ్యాచ్‌లో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని