IRE vs IND: రుతురాజ్‌ క్లాస్.. రింకు సింగ్‌ ఊరమాస్‌.. వీడియోలు అదుర్స్‌

వరుసగా రెండు టీ20ల్లోనూ (IRE vs IND) విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. ఐర్లాండ్‌ పర్యటనలో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. వరుణుడు ఎలాంటి ఆటంకం కలిగించని రెండో మ్యాచ్‌ వీడియోలు మీ కోసం..

Published : 21 Aug 2023 09:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్‌పై టీమ్‌ఇండియా (IRE vs IND) ఆధిక్యం కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా పూర్తి మ్యాచ్‌ జరగలేదని అభిమానులు కాస్త నిరాశపడ్డారు. అయితే రెండో టీ20 మాత్రం మొత్తం మ్యాచ్‌ జరగడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యారు. దానికి తగ్గట్టుగానే ఆటగాళ్లూ అద్భుత ప్రదర్శన ఇచ్చారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 185/5 స్కోరు చేయగా.. అనంతరం ఐర్లాండ్ 152/8 స్కోరు చేసి 33 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను గెలుచుకుంది. రెండో టీ20 మ్యాచ్‌ వీడియోల సమాహారం మీ కోసం..

గైక్వాడ్.. సూపర్ హాఫ్ సెంచరీ

భారత ఇన్నింగ్స్‌లో అత్యంత క్లాస్‌ ఆటను రుతురాజ్‌ గైక్వాడ్ ప్రదర్శించాడు. ఓపెనర్‌గా వచ్చిన రుతురాజ్‌ 43 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. 


రింకు దంచేశాడు.. 

టీమ్‌ఇండియా యువ ఆటగాడు రింకు సింగ్‌ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తాను బ్యాటింగ్‌ చేసిన తొలి మ్యాచ్‌లోనే 21 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు, మూడు సిక్స్‌లు కొట్టాడు. ఐపీఎల్‌లోనే కాదు అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ చివరి ఓవర్లలోనూ దూకుడుగా ఆడతానని నిరూపించుకున్నాడు. 


భారత ఇన్నింగ్స్‌లో సిక్స్‌లు

టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌లో ఎనిమిది సిక్స్‌లు ఉన్నాయి. ఇందులో రింకు సింగ్ 3,  శివమ్‌ దూబే 2.. శాంసన్, యశస్వి, రుతురాజ్‌ తలో సిక్స్‌ బాదారు. 


భారీగానే ఫోర్లు..

భారీ స్కోరు చేసిన భారత్‌.. బౌండరీలను కూడా ఎక్కువగా రాబట్టింది. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 13 ఫోర్లు వచ్చాయి. సిక్స్‌లు, ఫోర్లు కలిపి బౌండరీల రూపంలోనే వంద పరుగులు రావడం విశేషం. 


భారత వికెట్లు పడిందిలా.. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా ఐదు వికెట్లను కోల్పోయింది. ఐర్లాండ్‌ బౌలర్లు మెకార్తీ 2.. మార్క్‌ ఐదెర్, యంగ్, బెంజిమన్ వైట్ తలో వికెట్ తీశారు. 


ఐర్లాండ్‌ను చిత్తు చేసిందిలా.. 

భారత బౌలర్లు సమష్టిగా రాణించి ఐర్లాండ్‌ను కట్టడి చేశారు. ఆండ్రూ బల్‌బర్నీ (72), మార్క్‌ ఐదెర్ మినహా ఎవరూ పెద్దగా కుదురుకోకపోవడంతో ఐర్లాండ్‌కు ఓటమి తప్పలేదు. బుమ్రా, ప్రసిధ్, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు తీయగా..అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒక వికెట్ పడగొట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని