Ishan Kishan : లంకతో మూడో టీ20.. ఇషాన్‌ కిషన్‌కి విశ్రాంతి

తలకు బంతి తాకడంతో ఆసుపత్రిపాలైన ...

Updated : 27 Feb 2022 17:18 IST

ఆసుపత్రి నుంచి డిశ్చార్జైన టీమ్‌ఇండియా ఓపెనర్‌

ఇంటర్నెట్ డెస్క్‌: తలకు బంతి తాకడంతో ఆసుపత్రిపాలైన టీమ్ఇండియా వికెట్ కీపర్‌ ఇషాన్‌ కిషన్ కోలుకున్నాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. అయితే ఇషాన్‌ తమ వైద్యబృందం పరిశీలనలో ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. ఇవాళ జరిగే ఆఖరి టీ20 మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని పేర్కొంది. నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో ఇషాన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా శ్రీలంక బౌలర్‌ లాహిరు కుమార వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో తలకు బంతి బలంగా తాకింది. హెల్మెట్‌ ధరించి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఇషాన్‌ ఔటైన తర్వాత ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేశారు. అయితే గాయమేమీ కాకపోవడంతో ఇషాన్‌ను ఆసుపత్రి నుంచి వైద్యులు ఇవాళ డిశ్చార్జి చేశారు.

మూడు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే భారత్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా ఇవాళ జరగనుంది. ఆఖరి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ వికెట్‌ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అదేవిధంగా రోహిత్‌తో కలిసి మయాంక్‌ అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడో టీ20నూ కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్‌ చేయాలని టీమ్‌ఇండియా భావిస్తుండగా.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని లంక ఆశిస్తోంది. టీ20 సిరీస్‌ ముగిసిన తర్వాత మార్చి 4 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని