IPL 2021:అబుదాబి చేరుకున్న రోహిత్ శర్మ, బుమ్రా

ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దు కావడంతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను యూఏఈకి తరలించడంపై దృష్టిసారించాయి. ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్ శర్మ, ఆ జట్టు ఆటగాళ్లు జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌ శనివారం ప్రైవేట్‌  చార్టర్‌ ఫ్లైట్‌లో అబుదాబి చేరుకున్నారు. ఈ విషయాన్ని

Published : 11 Sep 2021 22:50 IST

(Photo:Mumbai Indians Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దు కావడంతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను యూఏఈకి తరలించడంపై దృష్టిసారించాయి. ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్ శర్మ, ఆ జట్టు ఆటగాళ్లు జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌ శనివారం ప్రైవేట్‌ చార్టర్‌ ఫ్లైట్‌లో అబుదాబి చేరుకున్నారు. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్‌ ధ్రువీకరించింది.‘ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, జస్ప్రీత్ బుమ్రా,సూర్యకుమార్‌ యాదవ్‌ తమ కుటుంబాలతో ప్రైవేట్‌ చార్టర్‌ ఫ్లైట్‌లో అబుదాబి చేరుకున్నారు.  వీరందరూ ఐపీఎల్ నిబంధనల మేరకు ఈ రోజు(శనివారం) నుంచి ఆరు రోజులపాటు కఠిన క్వారంటైన్‌లోకి వెళతారు. ఇంగ్లాండ్ నుంచి బయలుదేరే ముందు వీరికి ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులు చేశాం. అబుదాబి చేరుకున్న తర్వాత కూడా మళ్లీ ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులు జరిపాం. ఈ  రెండింటిలో అందరికీ నెగిటివ్ వచ్చింది’ అని ముంబయి ఒక ప్రకటనలో తెలిపింది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తమ ఆటగాళ్లను దుబాయ్‌కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. సెప్టెంబరు 19న  డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్‌-14 సీజన్‌ పున:ప్రారంభం కానుంది. బయోబుడగలో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కొవిడ్ బారినపడటంతో మే మొదటివారంలో ఐపీఎల్‌ వాయిదాపడిన సంగతి తెలిసిందే.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని