Ruturaj: ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు.. అప్పుడు గుర్తుకొచ్చింది అతడే: రుతురాజ్
భారత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు. ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు బాది అరుదైన ఘనత సాధించాడు. అయితే ఐదో సిక్స్ కొట్టిన తర్వాత మాజీ బ్యాటర్ ఒకరు గుర్తుకొచ్చారని రుతురాజ్ పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు కొట్టి అరుదైన రికార్డు సాధించిన రుతురాజ్ గైక్వాడ్‌కు ఆ సమయంలో గుర్తుకొచ్చిన ఆటగాడు ఎవరో తెలుసా..? టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదిన యువరాజ్ సింగ్ గుర్తుకొచ్చాడని రుతురాజ్ స్వయంగా వెల్లడించాడు. ఆరు సిక్స్‌లు కొట్టి యువరాజ్ సరసన చేరాలని బలంగా కోరుకున్నాడట. అయితే ఇప్పుడు ఏకంగా యువీనే దాటేయడం గమనార్హం. క్వార్టర్ ఫైనల్‌లో మహారాష్ట్ర బ్యాటర్ అయిన రుతురాజ్ ఉత్తర్‌ప్రదేశ్ మీద ఏడు సిక్స్‌లు కొట్టడంతో ఏకంగా 43 పరుగులు రాబట్టిన విషయం తెలిసిందే.
‘‘వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టిన తర్వాత ఒక వ్యక్తి మాత్రం నాకు గుర్తు వచ్చాడు. అతడే యువరాజ్ సింగ్. చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు వరల్డ్ కప్‌లో యువీ ఆరు సిక్స్‌లు కొట్టిన ఇన్నింగ్స్ చూశా. నేను కూడా అలా దిగ్గజం సరసన చేరాలని భావించా. అందుకోసమే ఆరో సిక్స్ కొట్టా. ఇలా ఒకే ఓవర్‌లో ఎక్కువ సిక్స్‌లు కొడతానని కలలో కూడా అనుకోలేదు’’ అని రుతురాజ్ వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో రుతురాజ్ 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్స్‌ల సాయంతో ఏకంగా 220 పరుగులు చేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS:రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలాముఖ్యం: ఆకాశ్ చోప్రా
-
General News
Andhra News: అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలుస్తాం: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
-
World News
Ukraine Crisis: ‘సైనిక చర్యకు ఏడాది వేళ.. భారీఎత్తున దాడులకు రష్యా ప్లాన్..!’
-
General News
TSSPDCL Jobs: గుడ్‌న్యూస్.. టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,601 ఉద్యోగాలకు ప్రకటన
-
Movies News
Yash: యశ్ ఇంటి వద్ద బారులు తీరిన అభిమానులు.. వీడియోలు వైరల్
-
India News
Modi: నాలుగేళ్లలో మోదీ 21 విదేశీ పర్యటనలు.. ఖర్చెంతో తెలుసా?