PV sindhu: దేశానికి మెడల్‌ తెచ్చినందుకు గర్వంగా ఉంది: సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం పతకం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని పీవీ సింధు అన్నారు. దేశానికి ఓ మెడల్‌ తీసుకొచ్చినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఒలింపిక్స్‌లో పాల్గొని స్వదేశానికి వచ్చిన సింధు....

Updated : 04 Aug 2021 18:57 IST

హైదరాబాద్‌: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం పతకం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని పీవీ సింధు అన్నారు. దేశానికి ఓ మెడల్‌ తీసుకొచ్చినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఒలింపిక్స్‌లో పాల్గొని స్వదేశానికి వచ్చిన సింధు.. బుధవారం హైదరాబాద్‌లోని తన స్వగృహానికి చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఈ సందర్భంగా తన కోచ్‌ పార్క్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఏడాది పాటు తన ఆట కోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. కొవిడ్‌ పరిస్థితుల్లోనూ ఏడాదిగా కొరియాకు వెళ్లకుండా, కుటుంబానికి దూరంగా ఉంటూ తనకు శిక్షణ ఇచ్చారన్నారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని, వారు కూడా క్రీడాకారులు కావడం వల్లే తనను ప్రోత్సహించారని చెప్పారు. తన విజయం వెనుక సుచిత్రా అకాడమీ కృషి కూడా ఎంతో ఉందని వివరించారు. ఈ సందర్భంగా సింధు కోచ్‌ మాట్లాడుతూ.. ఆటగాడిగా సాధించలేనిది కోచ్‌గా సాధించినందుకు గర్వంగా ఉందని, సింధును అందరూ అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ క్షణాలను జీవితంలో మరిచిపోనని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని