IPL 2021 : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మలి దశలో రెండో మ్యాచ్‌ అబుదాబి వేదికగా మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌), రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడనున్నాయి.

Updated : 20 Sep 2021 19:16 IST

ఇంటర్నెట్‌ డెస్కు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మలి దశలో రెండో మ్యాచ్‌ అబుదాబి వేదికగా మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌), రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడనున్నాయి.  టాస్‌ గెలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌.. బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి అంచెలో ఎదురైన ఓటమికి బదులివ్వాలనే కసితో కోల్‌కతా బరిలోకి దిగుతోంది. వరుస ఓటములతో సతమతవుతున్న కోల్‌కతా.. మలి అంచెలో శుభారంభం చేయాలని ఆశిస్తోంది. విరాట్‌ కోహ్లికి ఇది 200వ ఐపీఎల్‌ మ్యాచ్ కావడం విశేషం.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు..
వెంకటేశ్‌ అయ్యర్‌, శుభ్‌మన్ గిల్‌, నితీశ్‌ రానా, రాహుల్‌ త్రిపాఠి, సునీల్‌ నరైన్‌, ఇయాన్‌ మోర్గాన్ ‌(కెప్టెన్), ఆండ్రూ రస్సెల్‌, దినేశ్‌ కార్తిక్‌ (వికెట్‌ కీపర్‌), లాకీ ఫెర్గుసన్, వరుణ్‌ చక్రవర్తి, ప్రసిద్ధ్‌ కృష్ణ

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు..
విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌, కేఎస్‌ భరత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఏబీ డి విలియర్స్‌ (వికెట్‌ కీపర్‌), వనిందు హసరంగ, కైల్‌ జెమీసన్‌, హర్షల్‌ పటేల్‌, మహమ్మద్‌ సిరాజ్‌, సచిన్‌ బేబీ, యుజువేంద్ర చాహాల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని