Sanju Samson: మాకు ఇంకా షాకింగ్‌గానే ఉంది: సంజూ శాంసన్‌

రాజస్థాన్‌ రాయల్స్‌ (RR) తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో సాంకేతికంగా ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

Published : 20 May 2023 16:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ 2023 సీజన్‌లో (IPL 2023) రాజస్థాన్‌ రాయల్స్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది. ధర్మశాల వేదికగా పంజాబ్‌ను ఓడించి సాంకేతికంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచింది. ప్రస్తుతం రాజస్థాన్‌ 14 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం మంబయి, బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే రాజస్థాన్‌కు అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే తమ జట్టు ప్రదర్శనపైనా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. పంజాబ్‌పై 188 పరుగుల టార్గెట్‌ను రాజస్థాన్‌ 19.4 ఓవర్లలో ఛేదించింది. ఒకవేళ 18.3 ఓవర్లలో పూర్తి చేసి ఉంటే నెట్‌రన్‌రేట్‌లో బెంగళూరును అధిగమించే అవకాశం ఉండేది. 

‘‘హెట్మయెర్ క్రీజ్‌లో ఉండటంతో మ్యాచ్‌ను 18.5 ఓవర్లలోనే ముగిస్తామని అనిపించింది. అత్యున్నత ఆటగాళ్లతో కూడిన జట్టు మాది. అయితే మేం పాయింట్ల పట్టికలో ఉన్న స్థానాన్ని చూస్తే మాకే షాకింగ్‌ ఉంది. యశస్వి జైస్వాల్ ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడాడు. ఎంతో పరిణితితో పరుగులు రాబట్టాడు. ఓ వంద అంతర్జాతీయ టీ20లను ఆడిన అనుభవజ్ఞుడిగా మారాడు. ట్రెంట్ బౌల్ట్‌ తన తొలి ఓవర్‌లోనే వికెట్‌ తీస్తాడని మేం 90 శాతం అంచనా వేశాం. సరిగ్గా అలాగే వికెట్‌తో శుభారంభం ఇచ్చాడు. గత మ్యాచుల్లో ఓడిపోయి చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు మంచి విజయం సాధించాం’’ అని సంజూ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని