IND vs ENG : ఇంగ్లాండ్‌తో రెండో వన్డే.. జట్టులోకి కోహ్లీ.. టాస్‌ నెగ్గిన భారత్‌

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమ్‌ఇండియా ఉత్సాహంతో ఉంది. మరోవైపు టీ20 సిరీస్‌ కోల్పోవడంతోపాటు...

Updated : 14 Jul 2022 17:23 IST

బౌలింగ్‌ ఎంచుకొన్న రోహిత్ శర్మ

ఇంటర్నెట్ డెస్క్: లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమ్‌ఇండియా ఉత్సాహంతో ఉంది. మరోవైపు టీ20 సిరీస్‌ కోల్పోవడంతోపాటు మొదటి వన్డేలో ఘోర పరాభవం ఎదుర్కొన్న ఇంగ్లాండ్‌ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఎలాగైనా రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ రేసులో నిలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన భారత సారథి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకొని ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు. తొలి వన్డేకు దూరమైన టీమ్‌ఇండియా టాప్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చేశాడు. తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 110 పరుగులకే కుప్పకూల్చిన భారత్‌.. లక్ష్య ఛేదనలో వికెట్‌ కూడా నష్టపోకుండా విజయం సాధించింది. ఇలాంటి ప్రదర్శననే పునరావృతం చేయాలని టీమ్‌ఇండియా అభిమానులు ఆశిస్తున్నారు.

జట్ల వివరాలు: 

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, షమీ, బుమ్రా, చాహల్, ప్రసిధ్ కృష్ణ 

ఇంగ్లాండ్‌: జాసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్‌ లివింగ్‌స్టోన్, మొయిన్‌ అలీ, క్రెగ్‌ ఓవర్టన్, డేవిడ్ విల్లే, కార్సే, టోప్లే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని