Tokyo Olympics: బంగారు పతకం గెలిస్తే.. ఒక్కొక్కరికీ రూ.2.25 కోట్లు

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత హాకీ జట్టు బంగారు పతకం సాధిస్తే అందులోని పంజాజ్‌ ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.2.25 కోట్ల చొప్పున భారీ నజరానా అందజేస్తామని ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్‌ సింగ్‌ సోధి శుక్రవారం వెల్లడించారు...

Published : 31 Jul 2021 01:09 IST

చండీగఢ్‌: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత హాకీ జట్టు బంగారు పతకం సాధిస్తే అందులోని పంజాజ్‌ ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.2.25 కోట్ల చొప్పున భారీ నజరానా అందజేస్తామని ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్‌ సింగ్‌ సోధి శుక్రవారం వెల్లడించారు. తొలుత జట్టు మొత్తానికి రూ.2.25 కోట్లు అని ప్రకటించగా తర్వాత అది పంజాబ్‌ ఆటగాళ్లలో ఒక్కొక్కరికి మాత్రమేనని మంత్రి అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. టోక్యోలో జరుగుతున్న విశ్వక్రీడల్లో పంజాబ్‌కు చెందిన 11 మంది ఆటగాళ్లు బాగా ఆడుతున్నారని మెచ్చుకున్నారు.

మరోవైపు ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు వరుస విజయాలతో అదరగొడుతూ క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. పూల్‌-ఏలో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు నాలుగు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆస్ట్రేలియా మనకన్నా ముందు నిలిచి పూల్‌-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లూ క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే ఏదో ఒక పతకం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, భారత హాకీ జట్టు 1980లో చివరిసారి పతకం సాధించింది. ఇక అప్పటి నుంచి మరో పతకం కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది. ఈసారైనా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని