
Kohli - Dhoni: దగ్గరుండి కోహ్లీ బర్త్డే వేడుకలు చేసిన ధోనీ..
(Photo: Indian Cricket Team Instagram video screen shot)
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ శుక్రవారం 33వ పుట్టిన రోజు జరుపుకొన్నాడు. స్కాట్లాండ్తో మ్యాచ్ అనంతరం జట్టు ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్లో ఈ వేడుక నిర్వహించి సందడి చేశారు. ఈ సందర్భంగా మెంటార్, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ దగ్గరుండి మరీ కోహ్లీతో కేక్ కట్ చేయించాడు. ఆ వీడియోను బీసీసీఐ ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. కాగా, కోహ్లీ కేక్ కట్ చేశాక సహచరులు అతడి ముఖం నిండా కేక్ పూసి సరదాగా గడిపారు.
స్కాట్లాండ్ డ్రెస్సింగ్ రూమ్లో టీమ్ఇండియా..
మరోవైపు టీమ్ఇండియా ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం స్కాట్లాండ్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్కెళ్లి సందడి చేశారు. కెప్టెన్ కోహ్లీతో పాటు ఆటగాళ్లంతా వారి దగ్గరకెళ్లి కాసేపు ముచ్చటించారు. ఆ ఫొటోలను స్కాట్లాండ్ టీమ్ ట్విటర్లో పోస్టు చేసి సంతోషం వ్యక్తం చేసింది. టీమ్ఇండియా తమ వద్దకు వచ్చి ఇలా మాట్లాడటం బాగుందని కృతజ్ఞతలు తెలిపింది.