Virat Kohli: విరాట్ కోహ్లీపై ఆ నమ్మకం ఉంది: రికీ పాంటింగ్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. గడిచిన మూడేళ్లలో అతడు ఏ ఫార్మాట్‌లో కూడా సెంచరీ చేయలేదు. దీంతో  కోహ్లీ అలసిపోయాడని

Published : 11 Jun 2022 02:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. గడిచిన మూడేళ్లలో అతడు ఏ ఫార్మాట్‌లో కూడా సెంచరీ చేయలేదు. దీంతో  కోహ్లీ అలసిపోయాడని, అతడి పని అయిందని కొందరు విమర్శిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. ప్రతి ఆటగాడి జీవితంలో ఇలాంటి దశ ఉంటుందని, త్వరలోనే అతడు ఫామ్‌లోకి వస్తాడని పాంటింగ్‌ పేర్కొన్నాడు.

‘దాదాపు 10-12 ఏళ్లపాటు విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఆ సమయంలో అతడు విఫలమైన సందర్భాలు చాలా తక్కువ. అయితే భారత టీ20 లీగ్‌ జరిగినప్పుడు కోహ్లీ అలసటపై చాలా చర్చ జరిగింది. ఈ విషయంలో కోహ్లీ తనను తాను అంచనా చేసుకొని.. తనది టెక్నికల్ సమస్యా? లేక మానసిక సమస్యా? అనేది తేల్చుకోవాల్సి ఉంటుంది. అతడు మంచి ప్రొఫెషనల్ ప్లేయర్. కాబట్టి త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు కష్టపడతాడని నమ్మకం ఉంది’ అని పాంటింగ్‌ వివరించాడు.  

‘ఇన్నాళ్ల అనుభవంలో నాకు తెలిసిన మరో విషయం ఏంటంటే.. ఆటగాళ్లు తాము అలసిపోయినట్లు అంగీకరించరు. ఎలాగోలా ట్రైనింగ్ టైంకు వచ్చేస్తారు. మ్యాచ్‌కు రెడీ అవుతారు. విశ్రాంతి తీసుకున్నప్పుడే తాము ఎంత అలసిపోయింది వాళ్లకు తెలిసి వస్తుంది’ అని రికీ పాంటింగ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో కోహ్లీకి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. జులై 1న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టులో కోహ్లీ ఆడనున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని