Viral Video: రాకెట్‌ విసిరిన టెన్నిస్‌ ఆటగాడు.. త్రుటిలో తప్పించుకున్న బాల్‌బాయ్‌

ఓ టెన్నిస్‌ క్రీడాకారుడు ఓటమి బాధలో నేలకేసి కొట్టిన రాకెట్‌ త్రుటిలో ఓ బాల్‌బాయ్‌కు తగిలే ప్రమాదకర ఘటన ఇండియా వెల్స్‌ ఓపెన్‌ టోర్నీలో చోటుచేసుకుంది...

Updated : 19 Mar 2022 19:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ టెన్నిస్‌ క్రీడాకారుడు ఓటమి బాధలో రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. అయితే.. అది నేరుగా అక్కడే ఉన్న ఓ బాల్‌బాయ్‌ వైపు దూసుకెళ్లింది. అతడు వెంటనే అప్రమత్తమై త్రుటిలో తప్పించుకున్నాడు. ఇండియా వెల్స్‌ ఓపెన్‌ టోర్నీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఆస్ట్రేలియా ఆటగాడు నికోలస్‌ కిర్గియోస్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌తో తలపడ్డాడు. 7-6 (7/0), 4-7, 6-4 తేడాతో ఓటమిపాలయ్యాడు. మ్యాచ్‌ అనంతరం నాదల్‌తో కరచాలనం చేసిన అతడు‌.. తర్వాత అసహనంతో తన రాకెట్‌ను నేలకేసి విసిరికొట్టాడు. అది కోర్టులోనే ఓ మూలన నిల్చున్న బాల్‌బాయ్‌ వైపు బలంగా దూసుకెళ్లింది. వెంటనే బాల్‌బాయ్‌ పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన నిక్‌.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడు. ఆ బాల్‌బాయ్‌కి ఓ కొత్త రాకెట్‌ బహుమతిగా ఇస్తానని పేర్కొన్నాడు. దానికి ఆ బాల్‌బాయ్‌ సైతం సానుకూలంగా స్పందించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని