Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్‌ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్‌ కిస్‌ వీడియో..!

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ.. జానీ బెయిర్‌స్టో (106; 140 బంతుల్లో 14x4, 2x6)ను ఔట్‌ చేశాక ఫ్లైయింగ్‌ కిస్‌ చేశాడు...

Published : 04 Jul 2022 01:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ.. జానీ బెయిర్‌స్టో (106; 140 బంతుల్లో 14x4, 2x6)ను ఔట్‌ చేశాక ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్‌ మూడోరోజు ఆటను ప్రారంభించాక జాగ్రత్తగా ఆడారు. వికెట్‌ కాపాడుకుంటూ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశారు. అయితే, అదే సమయంలో ఏం జరిగిందో తెలియదు గానీ.. బెయిర్‌స్టో  కోహ్లీని ఏదో మాట అన్నాడు. దీంతో అతడు కూడా నోటికి పనిచెప్పాడు. ఇద్దరి మధ్య మాటలతూటాలు పేలడంలో అంపైర్లు కలగజేసుకొన్నారు. చివరికి వివాదం సద్దుమణిగింది.

అయితే, తర్వాత అనూహ్యంగా రెచ్చిపోయిన బెయిర్‌స్టో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అనూహ్యంగా దంచికొడుతూ వేగంగా శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ, కాసేపటికే షమి బౌలింగ్‌లో ఓ అద్భుత బంతికి స్లిప్‌లో కోహ్లీకి చిక్కాడు. దీంతో కోహ్లీ క్యాచ్‌ అందుకున్న వెంటనే ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడు. ఆ వీడియోను మ్యాచ్‌ ప్రసారదారులు ట్విటర్‌లో పంచుకున్నారు. మరోవైపు ఇద్దరి మధ్య జరిగిన వివాదాన్ని ఉద్దేశిస్తూ టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ ఓ చిలిపి ట్వీట్‌ చేశాడు. కోహ్లీ.. బెయిర్‌స్టోను స్లెడ్జింగ్‌ చేయకముందు స్ట్రైక్‌రేట్‌ 21 ఉందని, ఆ తర్వాత అది 150కి చేరిందని కామెంట్‌ చేశాడు. దానికి మరింత హాస్యాన్ని జోడిస్తూ.. పుజారాలా ఆడుతున్న బెయిర్‌స్టోను కోహ్లీ.. పంత్‌లా మార్చాడని జోక్‌ చేశాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని