WTC Final:ఆ జట్టే గెలుస్తుంది: మైఖేల్ వాన్‌

సౌథాంప్టన్‌ వేదికగా  జూన్‌ 18-22  మధ్య  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌(డబ్ల్యూటీసీ)ఫైనల్‌ జరగనుంది. ఈ  ప్రతిష్టాత్మక పోరులో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే

Published : 20 May 2021 01:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సౌథాంప్టన్‌ వేదికగా  జూన్‌ 18-22  మధ్య  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌(డబ్ల్యూటీసీ)ఫైనల్‌ జరగనుంది. ఈ  ప్రతిష్టాత్మక పోరులో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే  అంశంపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.  డబ్ల్యూటీసీ తుది పోరులో న్యూజిలాండ్‌ జట్టు గెలుస్తుందని ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్‌ అభిప్రాయపడ్డాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు  ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడటం కివీస్‌కు కలిసొస్తుందని పేర్కొన్నాడు.

‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో న్యూజిలాండ్ గెలుస్తుంది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందు భారత్ ఇక్కడికి చేరుకుంటుంది. కానీ ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులు, డ్యూక్‌ బాల్(ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ టెస్టు మ్యాచ్‌ల్లో ఉపయోగించే బంతి), ఫైనల్‌ ముంగిట వార్మప్‌లాగా ఇంగ్లాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశాలు. ఎర్రబంతితో ముఖ్యంగా డ్యూక్‌ బాల్‌తో  చాలా మంది కివీస్‌ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడారు. కాబట్టి న్యూజిలాండ్ గెలుస్తుందని అంచనా వేస్తున్నా అని మైఖేల్ వాన్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని