పండగకు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ద.మ.రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు..

Published : 15 Jan 2022 05:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ద.మ.రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు..
* కాకినాడ టౌన్‌ నుంచి సికింద్రాబాద్‌కు ఈ నెల 16, 18 తేదీల్లో రాత్రి 9 గంటలకు రైళ్లు ప్రారంభమవుతాయి.
* నర్సాపూర్‌-వికారాబాద్‌ రైలు 16, 18 తేదీల్లో రాత్రి 8.50కి ప్రారంభమవుతుంది.
* మచిలీపట్నం-సికింద్రాబాద్‌ రైలు 17, 19 తేదీల్లో రాత్రి 9.05కి మొదలవుతుంది.
* నర్సాపూర్‌-వికారాబాద్‌(జనసాధారణ్‌ స్పెషల్‌) రైలు 17న ఉదయం 10 గంటలకు, అనకాపల్లి-సికింద్రాబాద్‌ రైలు 16న రాత్రి 7 గంటలకు, తిరుపతి-సికింద్రాబాద్‌ రైలు 17న రాత్రి 8.15గంటలకు, కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌ రైలు 17న రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని