‘బోరు’ లేని ఊరు.. ఊట బావుల జోరు

తెలంగాణలో గతంలో సేద్యం చేయాలంటే తప్పకుండా బోరు వేయాల్సిందే. సాగునీటి కోసం కొంతమంది తమ పంట భూముల్లో 500 అడుగుల వరకు కూడా బోరుబావి తవ్విస్తారు. వందలాది అడుగుల లోతుల వరకు తవ్వించినా భూగర్భజలం పైకి రావడం గగనమే. ఇందుకు భిన్నంగా.

Updated : 15 Jan 2022 06:45 IST

తెలంగాణలో గతంలో సేద్యం చేయాలంటే తప్పకుండా బోరు వేయాల్సిందే. సాగునీటి కోసం కొంతమంది తమ పంట భూముల్లో 500 అడుగుల వరకు కూడా బోరుబావి తవ్విస్తారు. వందలాది అడుగుల లోతుల వరకు తవ్వించినా భూగర్భజలం పైకి రావడం గగనమే. ఇందుకు భిన్నంగా.. నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం బోరిగాం గ్రామస్థులు మాత్రం కొన్ని దశాబ్దాల నుంచి ఊట బావుల ఆధారంగానే వ్యవసాయం చేస్తున్నారు. సాగు నీటి కోసం ఒక్కటంటే ఒక్క బోరు కూడా ఊళ్లో లేకపోవడం ఇక్కడి గ్రామస్థుల ఐక్యతకు నిదర్శనం. బోరు వెయ్యకూడదని గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఉన్న కట్టుబాటును ప్రతి రైతు, ప్రజలు పాటిస్తుండటంతో భూగర్భజలాల వృద్ధి జరుగుతూనే ఉంది. ఇక్కడ అయిదారు అడుగుల లోతులోనే భూగర్భజలం ఉంది. దీంతో ఈ ఊరి రైతులు ఏడాదికి రెండు పంటలు పండిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. బోరిగాంలో సుమారు 150 వరకు వ్యవసాయ ఊట బావులున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే.

- న్యూస్‌టుడే, లక్ష్మణచాంద

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని