మేడారంలో పక్కాగా కొవిడ్‌ నిబంధనల అమలు

సమ్మక్క, సారలమ్మ మహాజాతరలో కొవిడ్‌ నిబంధనలకు ప్రాధాన్యమిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే సీతక్క, అధికారులతో కలిసి

Updated : 25 Jan 2022 05:26 IST

మంత్రి సత్యవతి రాథోడ్‌ వెల్లడి

మేడారం(తాడ్వాయి), న్యూస్‌టుడే: సమ్మక్క, సారలమ్మ మహాజాతరలో కొవిడ్‌ నిబంధనలకు ప్రాధాన్యమిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే సీతక్క, అధికారులతో కలిసి సోమవారం ఆమె ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పర్యటించారు. వనదేవతలకు పూజలు నిర్వహించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాగునీరు, మరుగుదొడ్లు, రహదారుల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భక్తుల రద్దీ ఉండే ప్రాంతాలను నిత్యం శానిటైజ్‌ చేస్తామన్నారు. ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తామని చెప్పారు. కొవిడ్‌ బారిన పడిన భక్తులు, అధికారులు ఉండేందుకు ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం స్థానిక గిరిజన, ఇతర వసతిగృహాలను వినియోగించుకుంటామని తెలపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని