సమాచార కమిషన్‌ స్థల పరిరక్షణకు చర్యలు: సీఐసీ

రాష్ట్ర సమాచార కమిషన్‌ సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించడానికి చర్యలు చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ) బుద్దా మురళి ఒక ప్రకటనలో తెలిపారు. స్థలం చుట్టూ గోడ, లోపల వాచ్‌మెన్‌

Published : 29 Mar 2022 05:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర సమాచార కమిషన్‌ సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించడానికి చర్యలు చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ) బుద్దా మురళి ఒక ప్రకటనలో తెలిపారు. స్థలం చుట్టూ గోడ, లోపల వాచ్‌మెన్‌ గదిని నిర్మించామని, సోమవారం ఆ గదిని ప్రారంభించామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ప్రభుత్వం సర్వే నంబరు 91లో ఎకరం స్థలాన్ని కేటాయించిందని, శాశ్వత భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని