Hardik Pandya: 10 సెకన్లు అదనంగా ఇవ్వడం ముఖ్యం

కెరీర్‌లో ఎత్తుపల్లాల్ని చిరునవ్వుతోనే తీసుకుంటానని గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. గాయాలతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన హార్దిక్‌..   గుజరాత్‌ అరంగేట్ర సీజన్‌లోనే ఆ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ‘‘జనాలు ఎప్పుడూ మాట్లాడతారు.

Updated : 26 May 2022 07:17 IST

కోల్‌కతా: కెరీర్‌లో ఎత్తుపల్లాల్ని చిరునవ్వుతోనే తీసుకుంటానని గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. గాయాలతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన హార్దిక్‌..   గుజరాత్‌ అరంగేట్ర సీజన్‌లోనే ఆ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ‘‘జనాలు ఎప్పుడూ మాట్లాడతారు. అది వారి పని. నేనేం చేయలేను. హార్దిక్‌ పాండ్య పేరు ఎప్పుడైనా అమ్ముడుపోతుంది. దాంతో నాకెలాంటి ఇబ్బంది లేదు. వాటన్నింటినీ చిరునవ్వుతో తేలిగ్గా తీసుకుంటా. నా జీవితంలో ధోనీ భాయ్‌ది కీలకపాత్ర. అతను ప్రియమైన సోదరుడు, ప్రియమైన స్నేహితుడు, కుటుంబం కూడా. అతని నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నా. వ్యక్తిగతంగా దృఢంగా ఉంటూ.. అన్ని విభాగాల్ని సమన్వయం చేస్తుండటం గర్వంగా అనిపిస్తుంది. సారథ్యానికి ముందు కూడా అన్ని పరిస్థితుల్ని ప్రశాంత మనస్తత్వంతో చూసేవాడిని. అలా ఉన్నప్పుడే మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు. నా వరకు జీవితంలో, క్రికెట్‌ ప్రయాణంలో హడావుడిగా కాకుండా 10 సెకన్ల అదనపు సమయం ఇవ్వడం ముఖ్యమని భావిస్తా’’ అని హార్దిక్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని