Telangana News: తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం

తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఒక్క మార్చి నెలలోనే రిజిస్ట్రేషన్ల...

Published : 31 Mar 2022 23:05 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఒక్క మార్చి నెలలోనే రిజిస్ట్రేషన్ల ద్వారా అత్యధికంగా రూ.1,501 కోట్ల రాబడి వచ్చినట్లు ఆ శాఖ వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.12,500 కోట్ల మేర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12,364 కోట్లు మేర రాబడి సమకూరినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు వెల్లడించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం దాదాపుగా సమకూరినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని