చిన్నారులను చిదిమేసిన చెట్టు

ఆనందంగా క్రికెట్‌ ఆడుతున్న చిన్నారులను ఓ చెట్టు చిదిమేసింది. గోడపై ఉన్న భారీ చెట్టు కూలిపడటంతో ఇద్దరు మృతి చెందగా నలుగురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఖమ్మం నగరంలోని బ్రాహ్మణబజార్‌లో

Published : 19 Jan 2022 04:59 IST

ఇద్దరి మృతి.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న నలుగురు బాలురు
ఖమ్మం నగరంలో విషాదం

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆనందంగా క్రికెట్‌ ఆడుతున్న చిన్నారులను ఓ చెట్టు చిదిమేసింది. గోడపై ఉన్న భారీ చెట్టు కూలిపడటంతో ఇద్దరు మృతి చెందగా నలుగురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఖమ్మం నగరంలోని బ్రాహ్మణబజార్‌లో జరిగిందీ ఘటన. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణబజార్‌కు చెందిన చిన్నారులు రాజ్‌పుత్‌ ఆయుష్‌(6), మల్వాడి దిగాంత్‌శెట్టి(11), కంచర్ల సాయిఆర్యన్‌, కొల్లపల్లి సాకేత్‌, రాజ్‌పుత్‌ అనుమోలు, చరణ్‌సాయి మంగళవారం సాయంత్రం సమయంలో ఆ వీధిలో ఉండే ఖాళీ స్థలంలో క్రికెట్‌ ఆడుకునేందుకు వెళ్లారు. ఆడుకుంటుండగా, పక్కనే ఉన్న ఒక గుంతలో బంతి పడిపోయింది. దానిని తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పక్కనే శిథిలగోడలో పెరిగిన చెట్టు విరిగిపడింది. అక్కడే ఉన్న పిల్లలపై చెట్టుకొమ్మలు, గోడ ఒక్కసారిగా పడటంతో ఆయుష్‌, దిగాంత్‌శెట్టి అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారిలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. సాయి ఆర్యన్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చుట్టుపక్కల వారు వేగంగా స్పందించి చెట్టు కొమ్మల మధ్య ఇరుక్కున్న నలుగురు బాలలను బయటకు తీశారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్‌ సిబ్బంది శిథిలాలను తొలగించి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. దిగాంత్‌శెట్టి తల్లిదండ్రులు కర్ణాటక రాష్ట్రం నుంచి, ఆయుష్‌ తల్లిదండ్రులు రాజస్థాన్‌ నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్నారు.

చెట్టుకొమ్మ కింద ఇరుక్కుపోయిన ఆయుష్‌ మృతదేహం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని