తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు

తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో

Published : 26 Jan 2022 05:04 IST

మంత్రి ప్రశాంత్‌రెడ్డి

జగిత్యాల, న్యూస్‌టుడే: తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్‌ చేసిన తప్పునకు శిక్ష తప్పదని అన్నారు. ఎన్నికల సమయంలో ఎంపీగా గెలిపిస్తే కొద్ది రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్‌పేపర్‌ రాసిచ్చి ఓట్లేయించుకున్నారని, మూడేళ్లు గడిచినా పసుపు బోర్డు జాడే లేదన్నారు. ఆ పంటకు మద్దతు ధర కూడా తేలేదన్నారు. ప్రస్తుతం పసుపు పంట చేతికి వచ్చే దశలో రైతులు ఆగ్రహంతో ఉన్నారని, ఈ విషయాన్ని పోలీసులు అర్వింద్‌కు ముందే చెప్పి రక్షణగా ఉన్నారన్నారు. అయినా కావాలని కయ్యం పెట్టుకుని మీడియాలో కనిపించేందుకు గ్రామాలకు వెళ్లారని మంత్రి వేముల అన్నారు. తప్పు చేసినవారు ఎవరైనా సరే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు