
అగ్రి కోర్సులపై అసత్య ప్రచారం నమ్మకండి
ఈనాడు, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించాకే పశువైద్య, ఉద్యాన, వ్యవసాయ డిగ్రీ కోర్సుల సీట్ల భర్తీకి ఆ ప్రక్రియ మొదలవుతుందని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శుక్రవారం ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఈ మూడు కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలలు జయశంకర్ వర్శిటీతో పాటు ఉద్యాన, పశువైద్య వర్శిటీలకు అనుబంధంగా ఉన్నాయి. ఇవి తప్ప ఎటువంటి ప్రైవేటు కాలేజీలకు అనుమతి లేదు. కొందరు ఈ సీట్ల భర్తీ ప్రారంభమైనట్లు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని, దాన్నినమ్మవద్దని విద్యార్థులకు సూచించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.