డీఎస్‌టీ కార్యదర్శిగా శ్రీవారి చంద్రశేఖర్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(డీఎస్‌టీ) కార్యదర్శిగా నియమితులయ్యారు. కేంద్ర

Published : 06 Dec 2021 05:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(డీఎస్‌టీ) కార్యదర్శిగా నియమితులయ్యారు. కేంద్ర క్యాబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ కార్యాలయం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. శ్రీవారి చంద్రశేఖర్‌ ప్రస్తుతం ఐఐసీటీతోపాటు నాగ్‌పుర్‌లోని జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్‌ పరిశోధన సంస్థకు ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌పై ఆయన నేతృత్వంలో ఐఐసీటీ పునర్వినియోగ ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు కొవిడ్‌ టీకా అభివృద్ధిలో తోడ్పాటు అందించింది. చంద్రశేఖర్‌ను ఐఐసీటీ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని