పెంబర్తి వరకు పచ్చదనం పెంపు

తెలంగాణలో వరంగల్‌ జాతీయ రహదారిపై యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్‌రోడ్డు వరకు ఉన్న పచ్చదనాన్ని (మల్టీలేయర్‌ ప్లాంటేషన్‌ గ్రీనరీ) పెంబర్తి వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పురపాలకశాఖ

Published : 17 Jan 2022 04:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో వరంగల్‌ జాతీయ రహదారిపై యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్‌రోడ్డు వరకు ఉన్న పచ్చదనాన్ని (మల్టీలేయర్‌ ప్లాంటేషన్‌ గ్రీనరీ) పెంబర్తి వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు 26 కిలోమీటర్ల మేర మొక్కల పెంపకానికి సుమారు రూ.5 కోట్లను హెచ్‌ఎండీఏ ద్వారా ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే వరంగల్‌ హైవేపై రూ.5.5 కోట్లను వ్యయం చేసి చేపట్టిన పనులతో ఆకుపచ్చని అందాలు కనువిందు చేస్తున్నాయని వివరించారు. పచ్చదనం పెంపు విషయంలో ఇది ఆదర్శ ప్రాజెక్టుగా నిలిచిందని పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో వారణాసి జాతీయ రహదారి వెంట చేపట్టేందుకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఈ ప్లాంటేషన్‌ను అధ్యయనం చేసిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని