ఆ తల్లి పరిస్థితి విషమంగా ఉంది

‘‘వరంగల్‌ జిల్లాకు చెందిన 72 ఏళ్ల మాదాడి శ్రీమతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అమెరికా నార్త్‌ కరోలినాలో పనిచేస్తున్న ఆమె కుమారుడు వినయ్‌రెడ్డికి అత్యవసర వీసా మంజూరు చేయండి’’ అని మంత్రి కేటీఆర్‌ కేంద్ర విదేశీ వ్యవహారాల

Published : 28 Jan 2022 04:41 IST

కుమారుడు వరంగల్‌ వచ్చేందుకు ప్రత్యేక వీసా ఇప్పించండి: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘వరంగల్‌ జిల్లాకు చెందిన 72 ఏళ్ల మాదాడి శ్రీమతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అమెరికా నార్త్‌ కరోలినాలో పనిచేస్తున్న ఆమె కుమారుడు వినయ్‌రెడ్డికి అత్యవసర వీసా మంజూరు చేయండి’’ అని మంత్రి కేటీఆర్‌ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను గురువారం ట్విటర్‌లో కోరారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతోనూ మాట్లాడారు. వినయ్‌రెడ్డి అంతకుముందు కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా తన పరిస్థితి వివరించారు. ‘‘నాకు కెనడా పౌరసత్వం ఉన్నందున అమెరికా ప్రభుత్వం వీసాను సస్పెండ్‌ చేసింది. వరంగల్‌ వచ్చేందుకు సాయం చేయండి’’ అని ఆయన అభ్యర్థించగా కేటీఆర్‌ స్పందించారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నల్గొండ జిల్లా నక్కలపెంట తండాకు చెందిన మూడేళ్ల బాలుడు హరిచంద్రకాంత్‌కు నిమ్స్‌లో చికిత్స చేయిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఒక నెటిజన్‌ బాలుడి కుటుంబ దీన స్థితిని మంత్రికి ట్విటర్‌ ద్వారా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని