అంకురాల్లో అగ్రస్థానం ఊహించిందే

అంకురాల్లో భారీ అభివృద్ధితో తెలంగాణ అగ్రస్థానం పొందడంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. టీహబ్‌, వీహబ్‌లను ఆయన అభినందించారు. ఈ ఫలితం తాను ఊహించిందేనని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొదటి ర్యాంకు తనను

Published : 06 Jul 2022 05:41 IST

ఇంకా ఎంతో సాధించాలి: మంత్రి కేటీఆర్‌ 

ఈనాడు,హైదరాబాద్‌: అంకురాల్లో భారీ అభివృద్ధితో తెలంగాణ అగ్రస్థానం పొందడంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. టీహబ్‌, వీహబ్‌లను ఆయన అభినందించారు. ఈ ఫలితం తాను ఊహించిందేనని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొదటి ర్యాంకు తనను ఆశ్చర్యపరచలేదని మంగళవారం ట్విటర్‌లో తెలిపారు. అయితే ఈ రంగంలో ఇంకా చాలా దూరం వెళ్లాలని, సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో టీహబ్‌, వీహబ్‌, రాష్ట్ర ఆవిష్కరణల విభాగం (టీఎస్‌ఐసీ), టీవర్క్స్‌, హైదరాబాద్‌ పరిశోధన, ఆవిష్కరణల మండలి (రిచ్‌), అగ్రిహబ్‌ల వంటి ఆవిష్కరణ సంస్థలు ఉండడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని