కాళేశ్వరం వద్ద పెరిగిన ప్రవాహం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి, ప్రాణహిత నదుల ప్రవాహం సోమవారం అనూహ్యంగా పెరిగింది. సరస్వతీ బ్యారేజీ నుంచి భారీగా వరద రావడం, ప్రాణహితలో ప్రవాహం పెరగడంతో

Published : 09 Aug 2022 04:09 IST

 లక్ష్మీ పంపుహౌస్‌ హెడ్‌రెగ్యులేటర్‌ గేట్ల మూసివేత

కాళేశ్వరం(జయశంకర్‌ జిల్లా), న్యూస్‌టుడే: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి, ప్రాణహిత నదుల ప్రవాహం సోమవారం అనూహ్యంగా పెరిగింది. సరస్వతీ బ్యారేజీ నుంచి భారీగా వరద రావడం, ప్రాణహితలో ప్రవాహం పెరగడంతో కాళేశ్వరం వద్ద ఏకంగా 10.3 మీటర్ల మేర నీటిమట్టంలో పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో లక్ష్మీ పంపుహౌస్‌ ఇంజినీర్లు అప్రమత్తమయ్యారు. ఎగువ నుంచి వరద వస్తుండటం, అప్రోచ్‌ కాలువ వద్ద నీటి మట్టం 101 మీటర్ల ఎత్తున ఉండటంతో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అప్రోచ్‌ కాలువ నుంచి ప్రవాహం పంపుహౌస్‌ వైపు రాకుండా హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద 11 గేట్లను మూసేయడంతోపాటు, చుక్కనీరు కూడా వెళ్లకుండా సీల్‌ చేసినట్టు సమాచారం.

ఆలమట్టి, నారాయణపూర్‌లకు భారీ వరద

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పెరుగుతోంది. ఆలమట్టికి 72 వేల క్యూసెక్కులు, జూరాలకు 80 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. తుంగభద్ర నుంచి 1.09 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. సోమవారం రాత్రికి సాగర్‌ జలాశయ నీటిమట్టం 575.00  అడుగులకు చేరినట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని