సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొనండి

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతం ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి

Published : 13 Aug 2022 04:14 IST

ప్రజలకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ పిలుపు
16న ఉదయం 11.30కి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతం ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కోరారు. శుక్రవారం తన కార్యాలయంలో ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక పురపాలక వార్డులు, ముఖ్యమైన ప్రధాన జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జైళ్లు, కార్యాలయాలు, మార్కెట్‌ స్థలాలు, గుర్తించిన ఇతర ప్రదేశాలలో 16న ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆయన కోరారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమన్వయం చేసుకొని అన్ని శాఖలూ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా ప్రదేశాలలో నోడల్‌ అధికారులను నియమించి, మైక్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి స్థానికంగా విస్తృత ప్రచారం చేయాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని