రాష్ట్ర పురపాలికలకు మరో 7 అవార్డులు

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’లో ఇటీవల వివిధ కేటగిరీల్లో 16 అవార్డులను దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర పురపాలికలు తాజాగా మరో 7 అవార్డులు సొంతం చేసుకున్నాయి.

Published : 25 Nov 2022 03:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’లో ఇటీవల వివిధ కేటగిరీల్లో 16 అవార్డులను దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర పురపాలికలు తాజాగా మరో 7 అవార్డులు సొంతం చేసుకున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న కేటగిరీలో ఈ అవార్డులను అందజేస్తున్నట్లు కేంద్ర పురపాలక శాఖ పేర్కొంది. ఈ మేరకు ‘ఫాస్ట్‌ మూవర్‌ సిటీ’ కేటగిరీలో.. 3-10 లక్షల జనాభా విభాగంలో వరంగల్‌ నగరపాలక సంస్థ మూడో స్థానంలో నిలిచింది. 50వేల నుంచి లక్ష జనాభా కేటగిరీలో కాగజ్‌నగర్‌ పురపాలక సంస్థ, జనగాం మున్సిపాలిటీలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 25-50 వేల జనాభా విభాగంలో అమనగల్‌, 15-25 వేల జనాభా కేటగిరీలో గుండ్లపోచంపల్లి (రెండోస్థానం), కొత్తకోట (మూడోస్థానం), 15 వేలలోపు జనాభా విభాగంలో వర్దన్నపేట (రెండోస్థానం) అవార్డులను దక్కించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని