సీఎం సార్‌.. మాకు ఉద్యోగాలు ఇవ్వండి

‘సీఎం సార్‌.. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం 14 సంవత్సరాలుగా తిరుగుతున్నాం. ఇప్పుడు మీ నియోజకవర్గమైన గజ్వేల్‌కు వచ్చి అడుగుతున్నాం. కనీసం ఇకనైనా కోర్టు తీర్పును గౌరవించి మాకు ఉద్యోగాలు ఇవ్వండి..’

Published : 21 Mar 2023 04:14 IST

గజ్వేల్‌లో కుటుంబసభ్యులతో కలిసి 2008 డీఎస్సీ అభ్యర్థుల ధర్నా

గజ్వేల్‌, న్యూస్‌టుడే: ‘సీఎం సార్‌.. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం 14 సంవత్సరాలుగా తిరుగుతున్నాం. ఇప్పుడు మీ నియోజకవర్గమైన గజ్వేల్‌కు వచ్చి అడుగుతున్నాం. కనీసం ఇకనైనా కోర్టు తీర్పును గౌరవించి మాకు ఉద్యోగాలు ఇవ్వండి..’ అని 2008వ సంవత్సరం డీఎస్సీ అభ్యర్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు సోమవారం తమ కుటుంబసభ్యులతో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు తరలివచ్చి ఇక్కడి అంబేడ్కర్‌ భవనం, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రులు మారినా తమకు న్యాయం జరగలేదని, కనీసం గజ్వేల్‌ నుంచి అయినా తమ గోడు వినిపిస్తే సీఎం న్యాయం చేస్తారన్న ఆశతో ఇక్కడికి వచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారని, ఇక్కడ ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. భాజపా, కాంగ్రెస్‌ నేతలు వారికి సంఘీభావం ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని