బాధితుల్లో తెలంగాణ ప్రయాణికులు లేరు: జీఎం
ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయ, పునరావాస కార్యక్రమాల్లో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈనాడు, హైదరాబాద్: ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయ, పునరావాస కార్యక్రమాల్లో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒడిశా ప్రభుత్వాన్ని, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను సంప్రదించారు. ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ స్పందిస్తూ- ఈ ప్రమాద ఘటనలో గాయపడ్డవారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఎవరూ లేరని తెలిపారు. అయినప్పటికీ బాధితులకు సహకారానికి ముందుంటామని రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు.
250 మందితో ప్రత్యేక రైలు
రైలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రయాణికులకు రైల్వేశాఖ అధికారులు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. సుమారు 250 మంది ప్రయాణికులతో ఒడిశాలోని భద్రక్ నుంచి చెన్నై వరకు ఈ రైలు నడుస్తోంది. ప్రయాణికుల్లో బ్రహ్మపుర, విశాఖ, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, చెన్నైల్లో దిగేవారు ఉన్నట్లు రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై టీఎస్పీఎస్సీ వివరణ
-
Asian Games 2023: ఈక్వెస్ట్రియన్‌లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్
-
Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 19,500 చేరువకు దిగొచ్చిన నిఫ్టీ
-
BJP: భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ!
-
Taiwan: చైనాకు భారీ షాకిచ్చిన తైవాన్.. సొంతంగా సబ్‌మెరైన్ తయారీ..!