Prakash Raj: మౌనంగా ఉంటే దేశ గాయాలు రాచపుండవుతాయి: ప్రకాశ్‌రాజ్‌

శరీరానికి తగిలిన గాయాలు మౌనంగా ఉన్నా మానిపోతాయని.. కానీ, దేశానికి తగిలిన గాయాలు మాత్రం మానకుండా రాచపుండుగా మారుతాయని సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ అన్నారు.

Updated : 13 Aug 2023 07:40 IST

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: శరీరానికి తగిలిన గాయాలు మౌనంగా ఉన్నా మానిపోతాయని.. కానీ, దేశానికి తగిలిన గాయాలు మాత్రం మానకుండా రాచపుండుగా మారుతాయని సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ అన్నారు. ప్రస్తుతం మనం అదే పరిస్థితిలో ఉన్నామన్నారు. మనం వెళ్తున్న దారిలో రక్తం ఉంటే.. దాని గురించి కవులు, రచయితలు, కళాకారులు తప్పక మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో ‘సమూహ’ పేరిట 14 మంది రచయితలు ఏర్పాటు చేసిన సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరమ్‌ ఆవిర్భావ సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాష్‌రాజ్‌.. వక్తలతో కలిసి సమూహ లోగోను ఆవిష్కరించి మాట్లాడారు. 100 రోజులుగా మణిపుర్‌లో హింసాకాండ జరుగుతూ ఉంటే తాజా పార్లమెంటు సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు 10 రోజులపాటు చర్చించి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. చట్టసభల్లో ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదన్నారు. మణిపుర్‌, హరియాణా రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొ.కాత్యాయిని విద్మహే, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్‌, రచయితలు యాకుబ్‌, భూపతి వెంకటేశ్వర్లు, పసునూరి రవీందర్‌, మీర్‌ అయూబ్‌ఖాన్‌, ప్రొఫెసర్‌ భంగ్యా భూక్యానాయక్‌, ప్రజాగాయని విమలక్క తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని