ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా చెన్నమనేని రమేశ్‌బాబు!

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబును నియమించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

Published : 26 Aug 2023 03:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబును నియమించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కేబినెట్‌ హోదాతో ఆయన అయిదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించాలని శుక్రవారం సీఎం కార్యాలయం అధికారవర్గాలను ఆదేశించింది. నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేశ్‌బాబుకు పౌరసత్వ సమస్యల దృష్ట్యా వచ్చే శాసనసభ ఎన్నికల్లో భారాస టికెట్‌ ఇవ్వరాదని కేసీఆర్‌ నిర్ణయించారు. దీనిపై చెన్నమనేని అసంతృప్తికి గురవడంతో సీఎం బుజ్జగించినట్లు తెలిసింది. రమేశ్‌బాబు జర్మనీ హంబోల్ట్‌ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ ఆర్థికశాస్త్రంపై పరిశోధనలు చేసి డాక్టరేట్‌ పొందారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆయనను రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా నియమించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు