Ambati Rambabu: సాగునీటిపై ఆశలు పెట్టుకోవద్దు: అంబటి రాంబాబు

నాగార్జునసాగర్‌ ఆయకట్టు కింద ఈ ఏడాది పంటలకు నీరిచ్చే పరిస్థితి లేదని, సాగునీటిపై ఆశలు పెట్టుకోవద్దని ఏపీ జల వనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Updated : 11 Oct 2023 07:04 IST

నకరికల్లు, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ ఆయకట్టు కింద ఈ ఏడాది పంటలకు నీరిచ్చే పరిస్థితి లేదని, సాగునీటిపై ఆశలు పెట్టుకోవద్దని ఏపీ జల వనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చాగల్లు గ్రామంలో మంగళవారం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి వచ్చిన మంత్రి రాంబాబును రైతులు కలిసి సాగునీరు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగార్జునసాగర్‌లో ఆశించిన మేర నీటి నిల్వలు లేవన్నారు. ప్రస్తుతం సాగర్‌ కాలువకు విడుదల చేస్తున్న 5 టీఎంసీలు తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలన్నారు. ఈ సంవత్సరం వర్షాధారమే తప్ప సాగర్‌ కాలువల కింద పంటలు సాగు చేసుకునే పరిస్థితి లేదన్నారు. నీరు మనం సృష్టించేది కాదని రైతులకు చెప్పారు. దొరికితే కొనుక్కొని వచ్చి ఇవ్వటం సులువు కాదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు