కేంద్రానికి కృతజ్ఞతలు

రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్‌ బియ్యం సేకరణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Published : 16 Apr 2024 03:29 IST

30 లక్షల టన్నుల బియ్యం సేకరణకు ఆదేశించింది: కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్‌ బియ్యం సేకరణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 2023-24 వానాకాలం, యాసంగి సీజన్‌లకు సంబంధించి ఈ మేరకు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంటూ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కనీస మద్దతు ధరను, ప్రత్యేక హామీగా ఇచ్చిన రూ.500 బోనస్‌ను చెల్లించి రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే సేకరించాలన్నారు.

భాజపాలో చేరిన పీఆర్‌టీయూ మాజీ నేతలు

పీఆర్‌టీయూ మాజీ నేత చెన్నకేశవరెడ్డి, మరికొందరు నేతలు సోమవారం కిషన్‌రెడ్డి సమక్షంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని